దేశీయ కార్ల తయారీ దిగ్గజం టాటా మోటార్స్ తన నెక్సాన్ కాంపాక్ట్ ఎస్యూవీ లైనప్‌లో నాలుగు కొత్త వేరియంట్‌లను విడుదల చేసింది. టాటా నెక్సాన్ 3 లక్షల యూనిట్ల అమ్మకాలను పూర్తి చేసుకున్న సందర్భంగా.. నెక్సాన్ లైనప్‌లో మరో నాలుగు కొత్త వేరియంట్లను జోడించింది.
దేశీయ కార్ల తయారీ దిగ్గజం టాటా మోటార్స్(Tata Motors) తన నెక్సాన్ కాంపాక్ట్ ఎస్యూవీ లైనప్‌లో నాలుగు కొత్త వేరియంట్‌లను విడుదల చేసింది. టాటా నెక్సాన్ 3 లక్షల యూనిట్ల అమ్మకాలను పూర్తి చేసుకున్న సందర్భంగా.. నెక్సాన్ లైనప్‌లో మరో నాలుగు కొత్త వేరియంట్లను జోడించింది. XZ+ (HS), XZA+ (HS), XZ+ (P), XZA+ (P) వేరియంట్లను పరిచయం చేసింది. ఈ కొత్త వేరియంట్ల ధర కనిష్టంగా రూ. 10.87 లక్షల నుంచి మొదలై రూ. 13.54 లక్షల వరకు ఉంటుంది. త్వరలోనే వీటి బుకింగ్ కూడా ప్రారంభించనున్నట్లు కంపెనీ తెలిపింది. టాటా నెక్సాన్(Nexon) కొత్త వేరియంట్లు అన్ని అధీకృత టాటా మోటార్స్(Motors) డీలర్‌షిప్‌లలో అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. కాగా, టాటా నెక్సాన్ పూర్తి చేసుకున్న 3 లక్షల యూనిట్లు పుణెలోని రంజన్‌గావ్ ప్లాంట్‌లోనే తయారు కావడం గమనార్హం.
మూడు లక్షల నెక్సాన్ ఎస్‌యూవీల అమ్మకాలు. : కొత్తగా విడుదలైన నాలుగు టాటా నెక్సాన్ వేరియంట్ల ధరను పరిశీలిస్తే.. నెక్సాన్ XZ+ (P) ధర రూ. 11,58,900 కాగా, XZA+ (P) ధర రూ. 12,23,900, నెక్సాన్ XZ+ (HS) ధర రూ. 10,86,800, నెక్సాన్ XZA+ (HS) ధర రూ. 11,51,800 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) వద్ద ఉంటాయి. ఈ కొత్త వేరియంట్లు పెట్రోల్, డీజిల్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంటాయని టాటా మోటార్స్ తెలిపింది. అలాగే ఇవి కొత్త రాయల్ బ్లూ ఎక్స్టీరియర్ పెయింట్ థీమ్‌లో కూడా లభిస్తాయి. టాటా నెక్సాన్ కొత్త వెర్షన్లు ప్రస్తుత మోడల్ మాదిరిగానే అదే డిజైన్‌తో వస్తాయి. డిజైన్ పరంగా ఎలాంటి మార్పులు ఉండవు.
అయితే, నెక్సాన్ XZ+ (P), XZA+ (P) వంటి కొత్త వేరియంట్లు బెనెక్యూ కాలికో లెథెరెట్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ఎయిర్ ప్యూరిఫైయర్, ఆటో-డిమ్మింగ్ IRVM వంటి అదనపు ప్రీమియం ఫీచర్లతో రానున్నాయి. మరోవైపు కొత్త XZ+ (HS), XZA+ (HS) వేరియంట్లు ఎయిర్ ప్యూరిఫైయర్ ఫీచర్‌తో వస్తాయి. ఈ వేరియంట్లు డార్క్ ఎడిషన్‌లలోనూ అందుబాటులో ఉంటాయి. ఈ నాలుగు కొత్త వేరియంట్లలో 1.5- లీటర్ డీజిల్ ఇంజన్ లేదా 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్లను అమర్చనున్నారు. ఇక, వీటి ఇంటీరియర్‌లో 7 -అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, ఆపిల్ కార్‌ప్లే, రెయిన్ సెన్సింగ్ వైపర్‌లు, వెనుక వైపు పార్కింగ్ కెమెరా, ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్‌లు వంటి ఫీచర్లను అందించింది.
No comments:
Post a Comment