Merry Christmas 2022 : యేసు పుట్టిన జన్మదినానికి గుర్తుగా క్రిస్టియన్స్.. క్రిస్మస్ను జరుపుకుంటారు. ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా ఈ వేడుకలు నిర్వహిస్తారు. అయితే మీ ఫ్రెండ్స్, కుటుంబసభ్యులకు.. ఈ క్రిస్మస్ గ్రీటింగ్స్ తెలుపుతూ.. ఎలాంటి కోట్స్, శుభాకాంక్షలు సోషల్ మీడియా వేదికగా ఏమి పంపాలో మీరు ఓ లుక్ వేయండి.
Merry Christmas 2022 : క్రిస్మస్ అంటే.. యేసు క్రీస్తు పుట్టినరోజు గురించి తెలియజేస్తూ.. క్రైస్తవులు జరుపుకునే పండుగ. ప్రతి సంవత్సరం డిసెంబర్ 25వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఉన్న జీసస్ భక్తులు ఈ వేడుకల్లో పాల్గొంటారు. ఆ సమయంలో కుటుంబం, సన్నిహితులతో సమయం గడుపుతారు. చర్చికి వెళ్లి.. క్రీస్తు ఆరాధన చేసి.. మధురమైన వంటకాలు చేసుకుని సంతోషంగా గడుపుతారు.
ఈ సంతోష సమయంలో మీకు దూరంగా ఉన్న మీకు కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్, సన్నిహితులకు పంపాల్సిన గ్రీటింగ్స్ గురించి ఏమైనా ఆలోచించారా? అయితే మీరు చింతించకండి. మీ కోసమే ఇక్కడ కొన్ని కోట్స్, గ్రీటింగ్స్ ఉన్నాయి. వారితో మీ సంతోషాన్ని పంచుకోవడానికి క్రిస్మస్ గ్రీటింగ్ కార్డ్‌లు, టెక్స్ట్‌లు లేదా మెయిల్‌లను పంపండి. దీనివల్ల మీరు మీ ప్రియమైన వారందరికీ-స్నేహితులు, కుటుంబ సభ్యులు, సహోద్యోగులు, పొరుగువారికి ఈజీగా మీ శుభాకాంక్షలను పంపవచ్చు. ఇంతకీ ఎలాంటి కోట్స్ పంపవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
* మా కుటుంబం తరపున మీకు.. మీ కుటుంబసభ్యులకు వండర్ఫుల్ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్ 2022 శుభాకాంక్షలు.
* దేవుడు మీకు తప్పకుండా ఆశీర్వాదాలు అందిస్తారు. మీ క్రిస్మస్ కరోల్స్ పాడండి. దేవుడిని స్తుతించండి. బహుమతులను పంచండి. క్రిస్మస్ చెట్టు దగ్గర మీరు కోరుకున్న కోరికలు.. అన్ని నెరవేరాలి. మీకు క్రిస్మస్ శుభాకాంక్షలు!
* ఈ క్రిస్మస్ సీజన్, రాబోయే సంవత్సరంలోని అన్ని సీజన్లలో మీకు శాంతి, ప్రేమ దొరకాలని కోరుకుంటూ.. క్రిస్మస్ శుభాకాంక్షలు.
No comments:
Post a Comment