Today Today india :ఆరోగ్యానికి మంచిదని మనలో చాలా మంది ఉదయం లేవగానే ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని తాగుతూ ఉంటారు. ఇది చాలా మంచిది. ఇలా వేడి నీరు తాగడం వలన జీర్ణ సంబంధ సమస్యలు తొలగిపోవడమే కాకుండా గొంతుకు సంబంధించిన సమస్యలు అధిక బరువు సమస్య తొలగిపోతాయి.
అయితే కొంతమంది నీటిని తాగితే మంచిదని రోజంతా వేడి నీటిని తాగుతూ ఉంటారు.
ఇలా ఎక్కువగా తీసుకోవడం వలన లాభాల కంటే నష్టాలే ఎక్కువ ఉంటాయని నిపుణులు
చెబుతున్నారు. ఇలా తరచుగా వేడినీటిని తీసుకుంటే తలనొప్పి చికాకు వచ్చే
అవకాశం ఉంది. ప్రస్తుతం ఎండలు పెరుగుతున్నాయి.
ఈ సమయంలో ఎక్కువగా వేడి నీటిని తీసుకుంటే అసలు దాహం తీరదు. అంతేకాకుండా ఎక్కువగా వేడి నీటిని తీసుకోవటం వలన గొంతులో కణాలు దెబ్బతినే అవకాశం ఉంది. అందువల్ల రోజులో రెండు నుంచి మూడు సార్లు వేడి నీటిని తీసుకుంటే సరిపోతుంది. అలాగే ఎక్కువసార్లు తీసుకుంటే ఆ ప్రభావం కిడ్నీల మీద పడి రక్తపోటు పెరిగే అవకాశం కూడా ఉంటుంది.
కాబట్టి ఏదైనా లిమిట్ గా తీసుకుంటే ఆరోగ్యప్రయోజనాలను పొందుతాం. అతిగా తీసుకుంటే అనార్ధాలు కలుగుతాయి. సమస్య ఉన్నప్పుడు ఎక్కువగా వేడి నీటిని తాగవచ్చు. ఏ సమస్యలు లేనప్పుడు రోజులో ఒకసారి వేడి నీటిని తీసుకుంటే సరిపోతుంది.
No comments:
Post a Comment